సదాశివనగర్, డిసెంబర్ 26 : జిల్లా ఆదర్శ రైతుగా ఎంపికైన సదాశివనగర్ ఉపసర్పంచ్ వంకాయల రవి (ఉప సర్పంచ్)ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నదని అన్నారు. రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సదాశివనగర్ సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, ఎంపీపీ గైని అనసూయ, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ శంకర్ నాయక్, సురేందర్ నాయక్, రమేశ్‌రెడ్డి, బాపురెడ్డి, పీర్సింగ్, దత్తు, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుస్తె, మెట్టెల అందజేత
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన యాదయ్య – నర్సవ్వ దంపతుల కుమార్తె వివాహానికి పుస్తె, మెట్టెలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పైడి జానకీ జనార్దన్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు సంకరి లక్ష్మీ రాజలింగం, ఎడ్ల రేణుకా నర్సింహులు, కాలభైరవ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ మర్కంటి బుచ్చన్న, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుమ్మరి రాజయ్య, నాయకులు శేకెల్లి మహేందర్, కృష్ణ, కలాలి సాయాగౌడ్, గుర్జాల నారాయణ పాల్గొన్నారు.