తాడ్వాయి, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సీఎంఆర్ఎఫ్తో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సురేందర్ లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26 మందికి మొత్తం రూ. 9,77,500 మంజూరైనట్లు తెలిపారు.
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత
తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో ఏడాది క్రితం తల్లి, కుమారుడు విద్యుత్ షాక్తో మరణించారు. మృతుల కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా రూ. 10 లక్షల రూపాయలు మంజూరు కాగా.. సంబంధిత చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
తాడ్వాయి మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ శనివారం ప్రారంభించారు. మూడో వార్డు నుంచి చిట్యాల రోడ్డు వరకు ఉన్న మార్గాన్ని సీసీ రోడ్డుగా మార్చడానికి రూ. 30 లక్షల రూపాయలు మంజూరు కావడంలో పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవి, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి, సీడీసీ చైర్మన్ మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింహులు, డీసీఎంఎస్ చైర్మన్ కపిల్రెడ్డి, సర్పంచ్ సంజీవులు, మండల నాయకులు రవీందర్రెడ్డి, సాయిరెడ్డి, గోపాల్రావు, నారాయణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.