నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 25 : జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నూతన దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఏసుక్రీస్తు వృత్తాంతాన్ని వివరించారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
బాన్సువాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవాళికి శాంతి, ప్రేమతో కూడిన జీవనమార్గాన్ని ఉపదేశించిన క్రీస్తు మార్గంలో నడువాలని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రామ్రెడ్డి, గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఎజాస్, మున్సిపల్ కో -ఆప్షన్ సభ్యుడు బాబా, తార, కౌన్సిలర్లు హకీం, లింగమేశ్వర్, రఫీ, వెంకటేశ్, బాడి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, రామాచారి పాల్గొన్నారు.
బీర్కూర్ మండలకేంద్రంలోని ఐపీసీ చర్చిలో నిర్వహించిన వేడుకలకు మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ హాజరై క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, శ్రీనివాస్, రాజుపటేల్, మన్నాన్ పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌లో సర్పంచ్ నారాయణరెడ్డి క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. బోర్లం గ్రామంలో ఏసుక్రీస్తు జననంపై ఫాదర్ సాయిలు భక్తులకు వివరించారు.
పిట్లం మండలకేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో ఫాదర్ ఇమ్మానుయేల్ సత్యం బైబిల్లోని పలు అంశాలపై వివరించారు. అన్నారం కలాన్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అన్నారం వెంకట్రాంరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి కమిటీ సభ్యులు బీరయ్య, దత్తు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో పిట్లం సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు బాల్‌రాజు, దేవదాస్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫాదర్ ప్రసాద్ బైబిల్లోని పలు అంశాలపై వివరించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
గాంధారి మండలకేంద్రంలోని బాప్టిస్టు చర్చి, జీవాధిపతి చర్చితోపాటు వండ్రికల్ నిష్కలంక మాత చర్చి, గుర్జాల్, రాంలక్ష్మణ్‌పల్లి, గండివేట్ తదితర గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కానుకలను అందజేసిన సీఎం కేసీఆర్‌కు క్రైస్తవులు కృతజ్ఞతలు తెలిపారు.
లింగంపేట మండలకేంద్రంతోపాటు కోర్పోల్, పర్మళ్ల, బూరుగిద్ద, ఎక్కపల్లి, రాంపూర్, నల్లమడుగు, భవానీపేట, పోతాయిపల్లి, లింగంపేట గ్రామాల్లో ఉన్న చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని బూరుగిద్ద గ్రామంలోని చర్చిలో ఫాదర్ చిన్నప్ప ఏసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. మండల కేంద్రంలోని జీవదాన్ దవాఖానలో ఏసుప్రభువు విగ్రహాన్ని అందంగా అలకంరించారు.