బీర్కూర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహం రోహిత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి విచ్చేసిన అతిథులను స్పీకర్ కుమారులు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, డాక్టర్ రవీందర్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. పెండ్లికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రెండు రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వివాహానికి తరలివెళ్లారు.