టీయూలో ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు
విలేకరుల సమావేశంలో వీసీ రవీందర్‌గుప్తా
డిచ్పల్లి, అక్టోబర్ 18 : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు కొత్తగా ఎ లాంటి రిక్రూట్మెంట్ జరగలేదని వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తా అన్నారు. ప్రతి రోజూ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన రిజిస్ట్రార్ కనకయ్యతో కలిసి పరిపాలనా భవనంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయం అభివృద్ధి వై పు అడుగులు వేస్తుంటే ఓర్వలేని మాజీ రిజిస్ట్రార్ శివశంకర్, మాస్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా చంద్రశేఖర్, పరీక్షల నియంత్రణ మాజీ అధికారి పాత నాగరాజు నేతృత్వంలో విద్యార్థి సంఘాల నాయకులు కలిసి యూనివర్సిటీ పరువును మంటగలుపుతున్నారని వీసీ ఆరోపించారు. రిజిస్ట్రార్ పోస్టును దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక కొందరు అధ్యాపకులు, విద్యార్థి సంఘ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారు అనుకున్న వ్యక్తికి రిజిస్ట్రార్ పోస్టు దక్కలేదన్న అక్కస్సుతో కొందరు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కు ట్రలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది ఎలాంటి అనుభవం లేక పోయినా త ప్పుడు ధ్రువపత్రాలతో వర్సిటీలో ప్రవేశాలు పొందారన్నారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీసి విచారణ కమిటీ వేసి న్యాయపరంగా చర్యలు తీసుకుంటామ ని వీసీ అన్నారు. అవసరమై తే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. వి ద్యార్థి సంఘాల నాయకులు శ్రీనివాస్‌గౌడ్, యెండల ప్రదీప్, పులిజైపాల్, ఎల్బీ రవికుమార్, పుప్పాలరవి, పంచరెడ్డిచరణ్ వారికి కావాల్సిన వారికి ఉ ద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వీసీ అన్నారు.
వారి డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో ముగ్గురు అధ్యాపకులతో కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారన్నారు.విద్యార్థి సంఘాల నాయకులమని చెప్పుకునే వీరు గతంలో పార్ట్ టైం అధ్యాపకులుగా చేరి తరగతులు చెప్పడం లేదని అన్నారు. ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత సూచనలతో వీరందరినీ విధుల నుంచి తొలగించామని, యూనివర్సిటీ పేజీలో శ్రీనివాస్‌గౌడ్ అసభ్యకరమైన పదాలు ట్యాగ్ చేశారని అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో సిబ్బందిని నియమించే అధికారం లేదని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని ఇందుకు పాలకమండలి అనుమతి తప్పక తీసుకుంటామన్నారు. నెల రోజుల నుంచి కొత్త గా చేరిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది భర్తీ విషయమై వీసీని ప్రశ్నించగా వర్క్అవుట్ సోర్సింగ్ ద్వారా కేవలం 12 మందిని మాత్రమే తీసుకున్నామన్నా రు. గతంలో పరీక్షా ఫలితాలు థర్డ్‌పార్టీ ద్వారా వెలువరించేవారిమని అందుకు రూ.12లక్షలు ఖర్చు అయ్యేదని ఇప్పు డు మనమే పరీక్షలను నిర్వహించడం ద్వారా కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యిందన్నారు.
ఇందుకోసమే పరీక్షల నియంత్రణ విభాగంలో 12 మందిని మాత్రమే తీసుకున్నామని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిచ్పల్లి మె యిన్ క్యాంపస్, భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగాపూర్ బీఈడీ కళాశాలలకు 113 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవసరమని ఉన్నత విద్యాశాఖకు లేఖలు పంపడం జరిగిందన్నారు. వర్సిటీలో 30 డిపార్ట్మెంట్లు ఉండగా ఎందులోనూ సరిపడా సిబ్బంది లేరన్నారు. హాస్టళ్లు ప్రారంభించడంతో సిబ్బంది అవసరం పెరిగిందని ఇదే విషయమై ప్రభుత్వానికి సైతం నివేదిక అందించామన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో అధికారి రాజశేఖర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు విన్నవించామన్నారు. విలేకరుల సమావేశంలో రిజిస్ట్రా ర్ కనకయ్య, ప్రిన్సిపాల్ నాగరాజు, ఆడిట్ సెల్ డైరెక్టర్ విద్యావర్ధిని, పరీక్షల నియంత్రణ అధికారిణి అరుణ తదితరులు ఉన్నారు.