గుర్తు తెలియని మెయిల్స్‌తో డేంజర్
ఫిషింగ్ లింక్‌ను టచ్ చేస్తే ఖాతాలోని డబ్బు మాయం
ఫోన్ బ్లాక్.. ఈ-మెయిల్ ఓటీపీలతో..
సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): ఐటీ రిటర్న్స్ రీఫండ్ పేరిట మీ మెయిల్ఐడీకి ఈ-మెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఆ మెయిల్లో వచ్చే లింక్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ టచ్ చేయకండి. . ఐటీ రిఫండ్ చేస్తామంటూ టీడీఎస్ పేరిట సైబర్ నేరగాళ్లు అమాయకులు, వ్యాపారులకు గాలం వేస్తున్నారు. లింక్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే డబ్బులు వస్తాయని ఆశచూపుతూ అచ్చం టీడీఎస్ లోగోతో మెయిల్ పంపుతూ మోసం చేస్తున్నారు. డబ్బులు వస్తాయని లింక్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేశారంటే చాలు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నింటినీ సైబర్ క్రిమినల్స్ దోచే అవకాశమున్నది.
సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు అమాయకుల ఖాతాలను కొల్లగొట్టేందుకు ఐటీ రిటర్న్స్ రిఫండ్ మెయిల్స్‌ను తమ అస్త్రంగా మార్చుకున్నారు. వీటితో వ్యాపారులను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ మెయిల్స్‌లో ఫిషింగ్ లింక్‌లను రూపొందించి వాటిని అటాచ్ చేసి పంపుతున్నారు. ఈ ఫిషింగ్ మెయిల్స్‌లో ముందస్తుగానే సైబర్ నేరగాళ్లు వారికి ఉపయోగపడేలా అందులో ఆధార్ నంబరు, పాన్ కార్డు నంబరు, బ్యాంక్ ఖాతా నంబర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఇలా బ్యాంక్ వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బును కొట్టేసేందుకు అన్ని అంశాలను పొందుపరుస్తున్నారు. తాజాగా వాటిలో యూపీఐ ఐడీ నంబర్లను కూడా అడుగుతున్నారు. ఇలా ఫిషింగ్ మెయిల్స్‌ను తయారు చేసుకొని వారు థర్డ్ పార్టీ నుంచి సేకరించుకున్న ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలకు వేలాది సంఖ్యలో పంపిస్తున్నారు. అయితే మెయిల్స్ చదివేందుకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా అచ్చం ఐటీ శాఖ ముద్రలు, వారి వెబ్సైట్లో ఉండే అక్షరాలను పోలి ఉండేలా లేఖలను తయారు చేస్తున్నారు. ఈ-మెయిల్ నిజంగానే ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు బోల్తా కొట్టించేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్‌బాక్స్‌కు మెయిల్ వచ్చినప్పుడు వచ్చే అలర్ట్ కూడా అచ్చం ఐటీ అధికారులు పంపినట్లుగా ఉండడంతో చాలా మంది వాటిని నమ్ముతున్నారని సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. వాటి దర్యాప్తులో బాధితులతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మెయిల్స్‌ను ఐటీ శాఖ నుంచి వచ్చినట్లే భావించి వాటిలో ఉన్న ఫిషింగ్ లింక్‌ను క్లిక్ చేసి అందులో ఉన్న అంశాలన్నింటికీ సమాచారాన్ని వివరిస్తున్నారు. అయితే ఈ ఐటీ రిటర్న్స్ మెయిల్స్ అత్యధికంగా టీడీఎస్, ఐటీ రిఫండ్ నగదు మీకు వచ్చింది దరఖాసు చేసుకోండని ఆశపుట్టిస్తారు. దీంతో చాలా మంది నిజంగానే దరఖాస్తు చేసుకుంటే నగదు వాపసు వస్తుందని ఆశపడి ఏమి ఆలోచించకుండా వెంటనే ఆ మెయిల్స్‌కు స్పందించి అందులోని ఫిషింగ్ లింక్‌ను తెరిచి సైబర్ నేరగాళ్లకు వారి మెయిల్స్ యాక్సిస్‌ను ఇచ్చేస్తున్నట్లు బయటపడింది.
టీడీఎస్… ఐటీ రిఫండ్ పేరిట..
ఐటీ రిటర్న్స్ కడుతున్న వారు, అసలు ఐటీ రిటర్న్స్‌తో సంబంధం లేని వారు అసలు మీ ఇన్‌బాక్స్‌కు వచ్చే ఐటీ రిటర్న్స్‌ను దరఖాస్తు చేసుకోండి నగదు వాపసు వస్తుందనే దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటికి సంబంధించి దరఖాస్తు సమయంలోనే మీ ఆర్థిక లావాదేవీలతోపాటు మీ బ్యాంక్ ఖాతా అందులో నమోదు ఉంటుంది కాబట్టి దరఖాస్తు తర్వాత మీకు రావాల్సిన డబ్బు ఉంటే ఐటీ శాఖ అధికారులు నేరుగా మీ ఖాతాకే పంపిస్తారు. అంతేగాని మీరు దరఖాస్తు చేసుకోండి మీకు వాపసు ఇస్తామని ఐటీ అధికారులు ఎప్పుడూ అడగరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. మీ ఇన్‌బాక్స్‌కు ఐటీ శాఖ పేరుతో వచ్చే మెయిల్స్‌తో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫోన్లకు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అసలు వెబ్సైట్లో వివరాలను తెలుసుకోండి. లేదా మీ ఆర్థిక సలహాదారులు, చార్టెడ్ అకౌంటెంట్‌ను సంప్రదిస్తే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి.
లింక్‌లోని సమాచారంతో సెర్చ్…
ఇలా సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ లింక్‌లతో సేకరించిన వివరాలతో ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాల వివరాలతో యూపీఐ ఐడీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయాలను తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో మరిన్ని వివరాలు సేకరించి వాటితో అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని పకడ్బందీగా విశ్లేషించుకొని సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టాల్సిన వ్యక్తిని టార్గెట్ చేసుకుని ముందుగా వారు ఫోన్లను బ్లాక్ చేస్తున్నారు. లింక్‌లో వచ్చిన సమాచారంతో టార్గెట్ వ్యక్తి మెయిల్స్‌లోకి చొరబడి పూర్తిగా కంట్రోల్ చేసుకుంటారు. అదే మెయిల్ ద్వారా మీ ఖాతాలను అనుకరించి వాటికి వచ్చే ఓటీపీల ద్వారా ఖాతాలను కొల్లగొడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు పసిగట్టారు. వ్యాపారులు, ఇతర ఉద్యోగులు ఇంకా ఆన్లైన్లో లావాదేవీలు జరిపే వారు ఐటీ రిటర్న్స్, టీడీఎస్ రిఫండ్ మెయిల్స్‌తోపాటు గుర్తు తెలియని వారి నుంచి వచ్చే మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్లు అకస్మాత్తుగా ఆగిపోతే వెంటనే అప్రమత్తం కావాలి, మీ మెయిల్స్‌ను కూడా తనిఖీ చేసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.