గాంధారి/ ఎల్లారెడ్డి/పిట్లం/ నిజాంసాగర్/ బీర్కూర్/నవంబర్ 14 : జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు నివాళులర్పించారు. గాంధారి మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేశ్, చాకలి కృష్ణ, మిట్యా నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘ కార్యాలయ ప్రాంగణంలో సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు ఆధ్వర్యంలో సొసైటీ వారోత్సవాలు, బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్ గోపీకృష్ణ, సీఈవో విశ్వనాథం, విద్యార్థులు పాల్గొన్నారు.
పిట్లం మండలకేంద్రంలో గౌడసంఘం సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు నెహ్రూ జయంతిని నిర్వహించారు. గౌడసంఘం మండల అధ్యక్షుడు సాయాగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జొన్న శ్రీనివాస్‌రెడ్డి, పిట్లం ఉపసర్పంచ్ ఇబ్రహీం, విండో చైర్మన్ శపథంరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్, మాజీ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, మాజీ ఎంపీపీ మహిపాల్‌గౌడ్, బీసీసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి యాదగిరి, గౌడసంఘం సభ్యులు బాబాగౌడ్, సుదర్శన్‌గౌడ్, బాలాగౌడ్, భానూగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రామాగౌడ్ పాల్గొనారు.
నిజాంసాగర్లోని బంజారాహిల్స్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, నాయకుడు సందీప్ విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను అందజేశారు.
నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో ఉన్న బుడగ జంగం కాలనీలో అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త అయ్యల సంతోష్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను బాగా చదివించాలని అన్నారు. బాల్యవివాహాలు చేయడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు.
బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి ప్రిన్సిపాల్ వసంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని సంగెంతండాలో సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ పాల్త్య విఠల్ హాజరై అంగన్వాడీ, పాఠశాల విద్యార్థులకు పలకలు, పెన్నులు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సునీల్ రాథోడ్, ప్రధానోపాధ్యాయుడు హరి, అంగన్వాడీ టీచర్ జుబేరా, కవిత, లలిత తదితరులు పాల్గొన్నారు.