ప్రభుత్వ విప్ గోవర్ధన్
బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి/మాచారెడ్డి, నవంబర్ 14: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)తో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలోని 39 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన కామారెడ్డిలోని తన నివాసం వద్ద బాధిత కుటుంబాలకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం కామారెడ్డి నియోజకవర్గంలో 1004 మందికి ఆరు కోట్ల 29 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. అనారోగ్యం బారిన పడి ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్లు జాహ్నవి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, గోపీగౌడ్, నిమ్మ దామోదర్‌రెడ్డి, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండా గ్రామానికి చెందిన బోడిగె ఎల్లాగౌడ్కు మంజూరైన రూ.60వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ప్రభుత్వ విప్ కామారెడ్డిలో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, సర్పంచ్ హంజీనాయక్, అబ్దుల్ ఖాన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు షేక్ జహంగీర్ తదితరులు ఉన్నారు.