బోధన్ అయ్యప్ప ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా..
పాల్గొన్న గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి
బోధన్, డిసెంబర్ 12: పట్టణంలోని భీమునిగుట్టపై ఉన్న శ్రీ ఏకచక్రపుర అయ్య ప్ప స్వామి ఆలయ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. 108 మంది దంపతులు అం దించిన 108 కలశాల ఆవు పాలు, మరో 108 కలశాల గంగాజలాలతో ఆలయంలోని మూల విరాట్, ఆలయ శిఖరాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి హాజరయ్యారు. 108 మంది దంపతులు అందించిన ఆవు పాలు, గంగాజలాల కలశాలతో ఆలయంలోని స్వామివారి విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ శిఖరాన్ని పండితులు, అర్చకులు అభిషేకించారు. ఆలయం ప్రధా న అర్చకులు సంతోష్ మహరాజ్ ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు మహా కుంభాభిషేకం నిర్వహించారు. పట్టణానికి చెందిన రవీంద్రబాబు, మీనార్‌పల్లి గ్రామానికి చెందిన భుజంగరావు, హైదరాబాద్‌కు చెందిన నల్లమోతు వశిష్ఠ భక్తులకు అన్నదానం చేశారు. ఏర్పాట్లను అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు శివన్నారాయణ, కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి కొయ్యాడ శ్రీనివాస్‌గౌడ్ పర్యవేక్షించారు.
ప్రేమ, సేవాతత్వం
మన జీవనవిధానం కావాలి