స్థానిక సంస్థల ప్రతినిధిగా కల్వకుంట్ల కవిత తనదైన ముద్ర..
రాజకీయాలకు అతీతంగాసామాజిక సేవ
ఉమ్మడి జిల్లా ప్రజలకు అండగా ..
మండలిలో స్థానిక గళం వినిపిస్తూ ప్రత్యేకతను చాటుతున్న నేత..
నిజామాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజాసేవలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా విశేషమైన సేవలందించిన కవిత… ఏడాది కాలంగా శాసనమండలి సభ్యురాలిగానూ తనదైన శైలిలో పనిచేస్తూ గుర్తింపు పొందుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లానుంచి స్థానిక సంస్థల ప్రతినిధిగా మండలిలో అడుగుపెట్టిన కవిత.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వేలాదిమందికి మేలు చేకూర్చేలా, రాజ్యాంగబద్ధమైన స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రసంగించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్నారు. గల్ఫ్‌లో భారతీయుల ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం విధించిన ఆంక్షలను ఎమ్మెల్సీగా గట్టిగా వ్యతిరేకించారు. 34 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు బాసటగా నిలిచారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజా సేవలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఇబ్బందులను ఆలకిస్తూ వారికి కొండంత అండగా ని లుస్తున్నారు. గల్ఫ్ సమస్య అయినా, ఆరోగ్య ఇబ్బందైనా, చదువుకు ఆర్థిక అడ్డంకులైనా… ఇలా ఏ సమస్యతో వ చ్చినా వారికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. లోక్‌సభ సభ్యురాలిగా విశేషమైన సేవలందించిన కవిత… ఏడాది కాలంగా శాసనమండలి సభ్యురాలిగానూ తనదైన శైలిలో పని చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. మండలిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు ప్రతినిధిగా అడుగు పెట్టి వారి దశాబ్దాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పాటుపడ్డా రు. వేలాది మందికి మేలు చేకూర్చేలా, రాజ్యాంగబద్ధమైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రసంగించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సంవత్సర కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో భిన్నమైన దృక్కోణంలో సమస్యలను పరిష్కరించడంలోనూ పాటుపడ్డారు. గల్ఫ్‌లో భారతీయుల ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం విధించిన ఆంక్షలను ఎమ్మెల్సీగా గట్టిగా వ్యతిరేకించారు. 34 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు బాసటగా నిలిచారు. లోక్‌సభ సభ్యురాలిగా ఆ పదవికే వన్నె తెచ్చారు. ఏడాది కాలంగా ఎమ్మెల్సీగానూ తనదైన ముద్రను వేసుకుంటున్నారు.
ఎంపీగా అలుపెరగని సేవ
రాష్ట్రంలో తొలి మహిళా లోక్‌సభ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఘనత సాధించారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. 2018 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. పార్లమెంట్లో వివిధ అంశాలపై తన వాయిస్‌ను వినిపించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాటాడ్లడం ఆమె ప్రత్యేకత. మహిళా సాధికారతపై విశేషంగా కృషి చేశారు. ఎంపీగా 15లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా నిలిచారు. పెద్ద బాధ్యతను నిర్వర్తించి నిజామాబాద్, జగిత్యాల జిల్లా ప్రజలకు ఎం తో మేలు చేకూర్చారు. పసుపు రైతులు చిరకాల కోరిక బోర్డు సమస్యపై ఢిల్లీ వేదికగా నినదించారు. బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేలా కృషి చేశారు. హైకోర్టు సాధన లో లోక్‌సభలో ముందుడి పోరాటం చేశారు. దేశ చరిత్రలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉమెన్ విభాగం ఆధ్వర్యంలోని ఎంపీల బృందాన్ని కవిత లీడ్ చేశారు. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ గ్రూపులో సభ్యురాలిగా పని చేశారు. 2014 పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో అదే అంశాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు కవిత. కశ్మీర్ పండిట్ల అంశంపై చేసిన ప్రసంగాన్ని యావత్ దేశం మెచ్చింది.ఎమ్మెల్సీగా ఏడాది కాలంగా వివిధ వర్గాల ప్రజలను తన పనితీరుతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఎమ్మెల్సీగా చారిత్రక గెలుపు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గతేడాది కవిత చారిత్రక విజయం సాధించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు ప్రతినిధిగా మండలిలో అడు గు పెట్టిన కవితకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి సైతం భారీ మద్దతు దక్కింది. ఎన్నికల్లో ఏక పక్ష విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. ఎమ్మెల్సీ పోరు లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 88శాతం ఓట్లు పోలయ్యాయి. పార్టీలకతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ఓట్లేశారు. అక్టోబర్ 12, 2020న ఎమ్మె ల్సీ ఉప ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ సైతం గల్లంతు కాగా కవిత అపూర్వ మెజార్టీతో చరిత్ర సృష్టించారు. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు బాధ్యతగా వహించిన కవిత.. 2020, అక్టోబర్ నుంచి ఎమ్మెల్సీగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మండలిలో ప్రతినిధిగా నిలిచారు. ఎమ్మెల్సీ హోదాలో నిజామాబాద్ జిల్లాలో బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి వారందరిలో నమ్మకం కల్పించారు. 2021, ఫిబ్రవరి 15న ఏకంగా 34 బీసీ కులాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన భేటీతో వారిలో ఐక్యతను తీసుకువచ్చారు. ఆయా సంఘాల బాధ్యుల నుంచి డిమాండ్లను, అవసరాలను, సలహాలను, సూచనలు స్వీకరించి ధైర్యం అందించారు.
గల్ఫ్ ఆంక్షలపై కన్నెర్ర
గతేడాది చివర్లో కేంద్ర ప్రభుత్వం అమానవీయమైన చ ర్యలకు ఉపక్రమించింది. గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న భారతీయుల పొట్టకొట్టేలా జీవోలు జారీ చేసింది. తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది మందిపై ప్రభావం చూపే కేంద్ర సర్కారు ఆదేశాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ హోదాలో కల్వకుంట్ల కవిత స్పందించారు. గల్ఫ్ కార్మికుల వేతనాల్లో 30నుంచి 50 శాతం వరకు కోత విధి స్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో లక్షలాది మంది గల్ఫ్ కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని గ్రహించి ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. మూడు నెలల పాటు సుదీర్ఘంగా కేంద్ర సర్కారు పెద్దలతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రం తప్పని పరిస్థితుల్లో సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక ఎమ్మెల్సీ కవిత కృషి మరువలేనిది. బీజేపీ ఎంపీగా నిజామాబాద్, జగిత్యాల నుంచి గెలిచి న ధర్మపురి అర్వింద్ మాత్రం కనీసం నోరు మెదపని సమయంలో ఎమ్మెల్సీ హోదాలో కల్వకుంట్ల కవిత చేసి న కృషి గొప్పదని గల్ఫ్ శ్రామికులు కితాబునిస్తున్నారు.