ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిలో పోటీపడాలి
వేల్పూర్‌లో అభివృద్ధి పనులతోపాటు డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కులసంఘాల నూతన భవనాలకు నిధుల మంజూరు
వేల్పూర్, అక్టోబర్ 11: సీఎం కేసీఆర్‌కు రైతులు, పేదలు రెండు కళ్లలాంటి వారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో పర్యటించారు. రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.6.30 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారి వెడ ల్పు, ఇరు వైపులా డ్రైనేజీలు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు, రూ.2.40 కోట్లతో బైపాస్ రోడ్డు వెడల్పు పనులకు మంత్రి ఇటీవలే శంకుస్థాపన చేశారు. అనంతరం తన నివాసంలో బాల్కొండ నియోజక వర్గంలోని వివిధ మండలాల్లో నూతన భవనాల నిర్మాణాలకు సంబంధించి ఆయా కుల సంఘాల ప్రతినిధులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలు, వర్గాలు సమానంగా జీవించాలన్న సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలకు అనుగుణంగా 40 కుల సంఘాల భవనాలకు రూ.కోటీ 80 లక్షలతో ప్రొసీడింగ్ కాపీలను అందజేసినట్లు తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు కుల సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తి కేంద్రంగా మానవీయ కోణంలో కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. ఏడేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అందరికీ కనిపిస్తూనే ఉన్నా, కొందరు నాయకులు మాత్రం ఏదో ఒక విమర్శ చేయాలని కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అభివృద్ధిలో తమతో పోటీ పడాలని ప్రతి పక్ష నాయకులకు సవాల్ విసిరారు. అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేనివారు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు.