నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 10: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయగా, వారిని వివిధ జిల్లాల నాయకులు అభినందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పీఆర్టీయూ టీఎస్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శని, ఆదివారాలు రెండురోజులపాటు కొనసాగాయి. ఆదివారం ముగింపు సమావేశం నిర్వహించగా, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హాజరై మాట్లాడారు. సమైక్యపాలనలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నారని అన్నా రు. దేశంలోని ఏ రాష్ట్రంలోలేని విధంగా సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించి అమలుచేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ సూచనల మేరకు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా వి ద్యార్థులకు మెరుగైన బోధన అందించారన్నారు. అనంతరం వీజీ గౌడ్‌ను పీఆర్టీయూ టీఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. సమావేశంలో భాగంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్‌గౌడ్, రాష్ట్ర, జిల్లా, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ ఎన్నిక
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూత న అధ్యక్ష, కార్యదర్శులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లు కూర రఘొత్తమరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎ మ్మెల్సీ పూల రవీందర్ ప్రమాణస్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లాల నుంచి వచ్చిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు.