ఎమ్మెల్యే షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుకు దళితుల ఘన స్వాగతం
ద్విచక్రవాహనాలతో నిజాంసాగర్ మండలంలో భారీ ప్రదర్శన
దళితుల ఆత్మగౌరవం కోసమే పథకానికి శ్రీకారం : ఎమ్మెల్యే షిండే
నిజాంసాగర్, సెప్టెంబర్ 6: దళితబంధు పథకం అమలుకు నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో సంబురాలు మరోసారి అంబరాన్నం టాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత సోమవారం మండలానికి వచ్చిన ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుకు దళితులు ఘన స్వాగతం పలికారు. దళిత సంఘాల నాయకులు సన్మానాలతో ముంచెత్తారు. ద్విచక్రవాహనాలతో సుమారు 20 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
దళితబంధు పథకానికి నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత మండలానికి వచ్చిన ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుకు దళితులు సోమవారం ఘన స్వాగతం పలికారు. దళిత సంఘాల నాయకులు సన్మానాలతో ముంచెత్తారు. హసన్‌పల్లి గేటు నుంచే ఊరూరా మహిళలు మంగళహారతులు పట్టగా.. పటాకులు కాలుస్తూ, బ్యాండు మేళాల మధ్య నృత్యాలు చేశారు. అక్కడి నుంచి అంజనాద్రి ఆలయం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుల్తాన్‌నగర్, నిజాంసాగర్, గోర్గల్, మాగి, వడ్డెపల్లి, నర్సింగ్‌రావ్‌పల్లి, మంగ్లూర్, అచ్చంపేట, బ్రాహ్మణపల్లి గేటు మీదుగా ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, దఫేదార్ రాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల గౌరవ అధ్యక్షుడు గైని విఠల్, అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి రమేశ్ వారిని సన్మానించారు. అనంతరం ర్యాలీలో ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ కూడా నృత్యాలు చేస్తూ దళితుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. చివరగా బ్రాహ్మణపల్లిలోని అంజనాద్రి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.