Kamareddy | నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి చెందిన ఏలే మల్లికార్జున్ బుధవారం హైదరాబాదులో ఈ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు తో కలిసి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు తెలంగాణ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట మంత్రి శ్రీధర్ బాబు సైతం ఉన్నారు.