వైభవంగా రథోత్సవం
రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం ఉదయం శ్రీకాలభైరవ స్వామి విగ్రహాన్ని రెండు గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు
- కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు సంపూర్ణం
- ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
- పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
రామారెడ్డి, నవంబర్ 17: రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం ఉదయం శ్రీకాలభైరవ స్వామి విగ్రహాన్ని రెండు గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. వేడుకలకు హాజరైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పటు చేసినా దక్షయజ్ఞం(అగ్ని గుండాలను ) కౌలాస్ మహంత్ ఆధ్వర్యంలో రామారెడ్డి వీరశైవులు జంగం ప్రభాకర్ స్వామి నిర్వహించారు.
భక్తులు ఓం భైరవ అంటూ అగ్ని గుండాలు దాటారు. అనంతరం గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌ను ఎమ్మెల్యే జాజాల సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయగా చైర్మన్ బెజుగం మాలతీసంతోష్ గుప్తా శాలువాతో సత్కరించారు. అనంతరం కౌలాస్ మహంత్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. వేడుకలకు కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్,రామారెడ్డి ఎస్సై అనిల్ 80మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కందూరి బాలమణీలింబాద్రి, సంజీవ్, రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, గాంధారి ఏఎంసీ చైర్మన్ సత్యంరావు, వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, ఉప సర్పంచ్ పోతునూరి ప్రసాద్, ఆలయ ఈవో ప్రభురాంచంద్రం, ఎంపీటీసీలు తుపాకుల రజితారాజేందర్ గౌడ్, భాగ్యలక్ష్మీశ్యాంసుందర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గర్గుల్ రాజాగౌడ్, ఆలయ మాజీ చైర్మన్ గంజి సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

