ఇందూరు, ఫిబ్రవరి 11 : ఉద్యోగ అవకాశాల్లో ఇండ స్ట్రీ -4 టెక్నాలజీ కీలకంగా మారిందని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 2000 సంవత్సరంలోనే ప్రారంభమైన ఈ టెక్నాలజీతో ఐవోటీ, ఏఐ, ఎస్ఐ, వీఆర్, బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉ న్నాయని, లక్షల్లో జీతాలు పొందవచ్చని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ-కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ తర్వా త తీసుకోవాల్సిన కోర్సుల ఎంపిక, ఉద్యోగ అవకాశాలు, రుణ సదుపాయాలపై కాకతీయ కళాశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ‘లక్ష్యం-2022’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. లక్కీడ్రాలో ఎంపికైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కేఎల్ యూనివర్సిటీలో వసతులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు వంటి అంశాలపై ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ రీజినల్ మార్కెటింగ్ హెడ్ రాజేశ్, నమస్తే తెలంగాణ ఏజీఎం (మార్కెటింగ్) రాజిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి రంగు ప్రవీణ్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఎంతో ప్రావీణ్యం కలిగిన ఫ్యాకల్టీ ఉంది. 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు పర్యవేక్షకుడిగా ఉంటారు. విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తూ, ఇస్రో, డీఆర్డీవో, డీఎస్టీలకు చెందిన పరిశోధనా ప్రాజెక్టుతో విద్యార్థుల్లో నైపుణ్యం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో వంటి అంతర్జాతీయ సాప్ట్వేర్ కంపెనీలకు చెందిన ఎక్సలెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నాం. విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థి అభిరుచికి అనుగుణంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి 72 హాబీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు మెరిట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10 నుంచి 100 శాతం వరకు ఫీజు రాయితీ కల్పిస్తున్నాం. 100 శాతం స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తున్నాం. విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం మా ప్రత్యేకత. మూడు సంవత్సరాలు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ విద్య కేఎల్ యునివర్సిటీలోనే ఉన్నది.
-డాక్టర్ జె.శ్రీనివాస రావు,డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ , కేఎల్ యూనివర్సిటీ
డాక్టర్ ఎల్. కోటేశ్వర్రావు, ప్రిన్సిపాల్, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి 360 డిగ్రీ అభివృద్ధే కేఎల్ యూనివర్సిటీ లక్ష్యం. విద్య, వైద్య, పర్యాటక, సినీ, పారిశ్రామిక రంగంతో పాటు సాఫ్ట్‌వేర్‌రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చుదిద్దుతున్నాం. ఎన్ఐఆర్ఎఫ్ సర్వేలో దేశంలోని వెయ్యి విశ్వవిద్యాలయాల్లో కేఎల్ యూనివర్సిటీ 35 స్థానంలో నిలిచింది. ప్లేస్మెంట్లో భాగంగా ప్రముఖ దిగ్గజ కంపెనీలతో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం కేఎల్యూకే సాధ్యం. ప్రపంచ దేశాల్లో మా పూర్వ విద్యార్థులు వేలల్లో ఉన్నారు. ఏ ఒక్కరికీ వీసా ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు కేఎల్ యూనివర్సిటీ చిరునామాగా నిలుస్తున్నది. సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక కేంద్రంగా హైదరాబాద్ క్యాంపస్‌లో బీటెక్‌తో పాటు 50 స్పెషలైజేషన్ కలిగిన సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈ, సివిల్ ఇంజినీరింగ్, బీటీ, ఐవోటీ, ఏఐడీఎస్, సీఎస్-ఐటీ లాంటి ఎన్నో కోర్సులతో విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు లక్షల్లో జీతాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు రెడ్ కార్పెట్ వేసి దిగ్గజ కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి.కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు నేర్పిస్తూనే సృజనాత్మకతకు పదును పెడుతున్నది.
ఇంటర్ తర్వాత మంచి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేయాలనుకుంటు న్నా. ఆర్థిక స్థోమత లేక ఎలా అని అనుకుంటున్న సమయంలో కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు రుణ సౌకర్యంపై అవగాహన కల్పించడంతో అపోహలు పోయాయి. ఆత్మ విశ్వాసం పెరిగింది. పరీక్షల్లో మంచి ప్రతిభ చూపి కేఎల్ యూనివర్సిటీలో చేరితే 85 శాతం వరకు బ్యాంక్ రుణం పొందవచ్చని తెలిపారు. పేద, మధ్య తరగతి వారికి ఇది ఎంతో ఉపయోగం.
-జయంత్, విద్యార్థి
పట్టుదలతో చదివితే లక్షల రూపాయల జీతం పొందవచ్చని ఈ రోజు తెలుసుకున్నాను. నైపుణ్యం పొందితే చాలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వస్తాయని తెలియజేశారు. చదువు గురించి తెలుసుకున్నాను. సంవత్సరానికి రూ.20 నుంచి 30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఎలా పొందాలో తెలియజేశారు. ఇది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇకపై నేను పట్టుదలతో చదివి మా తల్లిదండ్రులకు సాయంగా ఉంటాను.
-అనురాగ్, విద్యార్థి
ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు చదవాలో తెలియక తికమక పడ్డాను. కేఎల్ యూనివర్సిటీ వారు కామన్ కోర్సులు కాకుండా నచ్చిన కోర్సుల్లో ఎలా అడ్మిషన్ పొందాలో వివరించారు. ఇండస్ట్రీ -4 టెక్నాలజీ విప్లవంతో ఐవోటీ, ఏఐ, ఎస్ఐ, వీఆర్, బ్లాక్ చెయిన్, పూల్ స్టాక్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలపై చక్కగా చెప్పారు. క్రీడల కోసం పెద్ద పీట వేయడం విద్యార్థులకు నచ్చే విషయం.
-కార్తీక్, విద్యార్థి
విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించుకోవాలో చక్కగా చెప్పారు. ఇంటర్ తర్వాత అవకాశాల గురించి సదస్సు ఏర్పాటు చేయడం బాగుంది. ఏదైనా సాధించేలా ప్రోత్సహించిన కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణకు కృతజ్జతలు.
-సాయికుమార్, విద్యార్థి