Gold seaze : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఈ బంగారాన్ని పట్టుకున్నారు. ఇవాళ (సోమవారం) అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అతని దగ్గర సుమారు 800 గ్రాముల బంగారం దొరికింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తీసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారిగా గుర్తించారు. అతని లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.
ముందుగా కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లోనే ఈ బంగారాన్ని గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని విచారణ కోసం డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. దాంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.