మద్దూరు ( నారాయణపేట) : కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ( Lift Irrigation ) పథకంలో భాగంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని దామగాన్పూర్ గ్రామంలో పాత సర్వే ప్రకారం కాలువల నిర్మాణం ( Canal Construction ) చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం పాదయాత్ర ( Farmers Padayatra ) చేపట్టారు. గ్రామం నుంచి మద్దూరు తహసీల్ కార్యాలయం వరకు పాదయాత్రగా చేరుకున్న రైతులు, తహసీల్దా ర్కు వినతిపత్రం అందజేశారు.
పాత సర్వే ప్రకారం కాలువలు ఏర్పాటు చేస్తే తమ వ్యవసాయ భూములకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని రైతులు వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న మార్గంలో కాలువలు నిర్మిస్తే రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, పాత సర్వే ప్రకారం కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులు పేర్కొన్నారు.