మాక్లూర్/ఆర్మూర్, అక్టోబర్ 18 : అధికారం ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాంగ్రెస్ సిద్ధాంతమని.. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ సిద్ధాంతమని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మళ్లీ తెలంగాణ అధోగతి పాలు కావడం తథ్యమని, కాంగ్రెస్ బలం కర్ణాటక నుంచి వస్తున్న నోట్లు, బీఆర్ఎస్ బలం తెలంగాణ ఓట్లు అని వ్యాఖ్యానించారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగం గా మాక్లూర్ మండలం చిక్లీ, ఆర్మూర్ మండలం డీకంపల్లి గ్రామాల్లో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. సకలజనుల గుండెల నిండా గులాబీ జెండా కొలువై ఉందన్నారు. ఈ ఎన్నికల్లోనూ జెట్ స్పీడ్‌తో ‘కారు’ దూసుకెళ్తుందన్నారు. హ్యాట్రిక్ విజయంతో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం.. కేసీఆర్‌కు రెండు కం డ్లు, కేసీఆర్ దార్శనికతతో ఆర్మూర్ నియోజకవర్గానికి మహర్దశ పట్టిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, సర్పంచులు ప్రమీల, బీఆర్ఎస్ నాయకులు హరిచర ణ్, రవి, వెంకట్‌గౌడ్, భూమన్న, రంజిత్, విండో చైర్మ న్ శ్రీనివాస్‌గౌడ్, రంజిత్, శ్రీకాంత్, షబ్బీర్, ఎర్రన్న పాల్గొన్నారు.
వంజరి కులస్తుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అడవి మామిడిపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. వంజరి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.కోటి నిధులు, 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భం గా రాష్ట్ర వంజరి సంఘం నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మేళనంలో ఆశన్నగారి రజితారెడ్డి, వంజరి కులస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వంజరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాలేరు నరేశ్, జిల్లా అధ్యక్షుడు బోనేకర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి గంగోనే మల్లేశ్, జిల్లా కోశాధికారి నర్సయ్య, కాలేరు రామోజీ, గోవర్ధన్, గంగోనే సంతోష్, సుభాష్, రాజు, చిన్నరమేశ్, శ్రీనివాస్, భూమయ్య పాల్గొన్నారు.