ఖలీల్వాడి, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కేవీ ప్రతినిధి విజయలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభు త్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. బీసీలకు 42 శాతం కోటా కోసం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత పోరాటం చేసి విజయం సాధించారన్నారు. ఆమె చేసిన ఉద్యమంతో సర్కారు దిగొచ్చిందన్నారు. కార్యక్రమంలో అనసూయ, జ్యోతి, నవతారాణి, దేవిక, సునీత, మహేశ్వరి, హర్షిక పాల్గొన్నారు.