ఎల్లారెడ్డి రూరల్, జనవరి 8: ఎల్లారెడ్డి పట్టణంలో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణంలో నాణ్యతను హైదరాబాద్ నుంచి వచ్చిన న్యాక్ బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు, స్లాబ్, ఫ్లోరింగ్లలో వాడిన కంకర, ఇసుక, ఐరన్, సిమెంట్ శాతం, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి, కంకర, ఇసుక శాంపిల్స్‌ను సేకరించారు. సూచించిన కొలతల ప్రకారం నిర్మా ణం జరుగుతుందా లేదా విషయంపై ఆరా తీశారు. బృందంలో న్యాక్ సభ్యుడు ఈఈ జైపాల్, మెడికల్ అండ్ హెల్త్ ఈఈ కుమార్, కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు.