kamareddy | బిబిపెట్ (దోమకొండ), జూన్ 28 : దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి లబ్ధిదారులను ఎంపిక చేసి తొందరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెలియజేశారు.
దోమకొండ గ్రామంలో రాజీవ్ నగర్ కాలనీలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇందిరమ్మ ఇండ్లకు శనివారం ముగ్గు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇందిరమ్మ, కమిటీ సభ్యులు, సీతారాం మధు, అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, సెమ్మి, పూలబోయిన రమేష్, అబ్రోయిన రాజేందర్, నిమ్మ బాలరాజు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.