మోర్తాడ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Houses) త్వరగా పూర్తి చేయాలని మోర్తాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య ( Chairman Palepu Narsaiah) సూచించారు. మోర్తాడ్ మండలం నాగపూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించాలని సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్లాట్ ఉండి ఇండ్లు లేనివారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశామని వివరించారు . రెండో విడతలో ప్లాట్ లేకుండా ఇండ్లు లేనివారిని ఎంపిక చేస్తామని వెల్లడించారు.
ఆ తరువాత అర్హులైన మిగతా వారిని ఎంపిక జరుగుతుందన్నారు. మిగతా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులకు విడుతల వారీగా డబ్బులు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, శేఖర్, రాజేశ్వర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు .