కామారెడ్డి : ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసంఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచిందని ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) పేర్కొన్నారు. టీచర్స్ (Teachers), గ్రాడ్యుయేట్ (Graduate) ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల సమావేశాన్ని శుక్రవారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటును వేయాలన్నారు.
మొన్నటి కేంద్ర బడ్జెట్ (Budget) సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. మహిళలు స్వశక్తి చెందేందుకు చట్టసభలో రిజర్వేషన్లు ప్రకటించిందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్నును మాఫీ చేసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. విధాన సభలో ప్రశ్నించే గొంతు ఎత్తడానికి బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.