చిన్నారుల మృతి కలిచివేసింది
మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాలనీలో నివాసం ఉంటూ కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్న వారి గుడిసెలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదర్చారు.
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల
- బాధిత కుటుంబాలకు పరామర్శ
- రూ. 18 వేల ఆర్థిక సాయం అందజేత
- పక్కా ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచన
భీమ్గల్, జూన్ 7: మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాలనీలో నివాసం ఉంటూ కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్న వారి గుడిసెలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదర్చారు.
కన్నీరు మున్నీరవుతున్న తల్లుల రోదనలు వేములను కలిచివేశాయి. ఘటన సమయంలో తన కుమారుడు, కూతు రును కోల్పోయిన ఓ తల్లి తీవ్ర మనోవేదనలో అదే కుంటలోకి దూకేందుకు యత్నించగా ఆమె కాలికి గాయమైంది. ఈ విష యం తెలుసుకున్న వేముల ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు. చికిత్స కోసం ఎలాంటి బిల్లులూ తీసుకోవద్దన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోకు ఫోన్ చేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సాయం అందించాలని కోరారు.
వారికి పక్కా ఇండ్లు మంజూరు చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు రూ. 18 వేలు ఆర్థిక సాయం అందజేశారు.అనంతరం ఆయన ప్రమాదానికి కారణమైన నీటి కుంటను పరిశీలించారు. ప్రమాదకరంగా మారిన కుంటను పూడ్చివేసేందుకు చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వేముల వెంట మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, కౌన్సిలర్లు నీలం రవి, బొదిరె నర్సయ్య, నాయకులు రాజూనాయక్, సూర్జీల్, సాయి కుమార్, శెవ్వ అశోక్, కైత సాగర్, శ్రీపాద గోపి, తొగిటి అరుణ్ తదితరులున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

