ఆ వ్యాఖ్యల్లో తప్పేమీలేదు.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
- రాజగోపాల్ మండే అగ్నిపర్వతంలాంటోడు
- మంత్రి పదవి కావాలని ఆయన ఎప్పుడూ అడుగలే
- ప్రజాసమస్యలపైనే ఫోకస్ పెట్టిండు
జడ్చర్ల టౌన్, ఆగస్టు 15: కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేమీలేదని తేల్చిచెప్పారు. ఆయన ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నారని, రాజగోపాల్‌రెడ్డి మండే అగ్నిపర్వతంలాంటోడని, ఆయనకు కోపం వచ్చిందంటే అగ్నిపర్వతం పేలినట్టుగా ఉంటుందని చెప్పారు.
ఆయన ఎప్పుడూ తనకు మంత్రి పదవి కావాలని కొట్లాడలేదని, కానీ, ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నారని, దాంట్లో తప్పేంలేదని తెలిపారు. చాలా సమస్యలపై తాను చాలాసార్లు మాట్లాడానని గుర్తుచేశారు. ఒకవేళ మంత్రి పదవి కావాలంటే అప్పుడే కొట్లాడేవాడని పేర్కొన్నారు. వాటిని సరిచేసుకుంటే పార్టీకే మంచి పేరు వస్తుందని సూచించారు. తన నియోజకవర్గంలోనూ కొందరు అధికారులు చిన్న చిన్న సమస్యలు, విరాసత్‌లు చేయడం కోసం నెలల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు అడిగినా తన దృష్టికి తేవాలని ప్రజలకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

