కూషీటే ఊృంఃష్యకా.. కూట్హౌఖీ ఊసిఎనీ!
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ట్రాక్టర్లకు బదులుగా ట్రాలీ ఆటోల్లో ఇసుకను తరలిస్తున్నారు.
- బోధన్ మండలంలో జోరుగా అక్రమ రవాణా
- నంబర్ ప్లేట్ లేని ట్రాలీ ఆటోల్లో తరలింపు
- పట్టించుకోని సంబంధిత అధికారులు
శక్కర్నగర్, జూలై 13: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ట్రాక్టర్లకు బదులుగా ట్రాలీ ఆటోల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ట్రాలీ ఆటోలకు నంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. ఆదివారం అయితే చాలు.. ముఖ్యంగా బోధన్- నిజామాబాద్ రహదారిపై ట్రాలీ ఆటోలు పోటీ పడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇసుకను అక్రమంగా తరలించే కొన్ని ఆటోలు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ల మీదుగా వెళ్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొన్ని ఆటోలు మాత్రం బోధన్ మండలంలోని పలు గ్రామాల మీదుగా, పెగడాపల్లి, పెంటాకలాన్, సాటాపూర్ గేట్ నుంచి సారంగపూర్ జైలు రోడ్డు గుండా పోలీస్ స్టేషన్లను తప్పించుకుంటూ వెళ్తున్నాయి. ప్రతిరోజూ ఈ రహదారి మీదుగా సుమారు 50 నుంచి వంద ట్రాలీ ఆటోల్లో ఇసుక రవాణా జరుగుతున్నది. ఇసుక అక్రమ రవాణా మాట ఎలా ఉన్నా.. మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆటోలకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో కేసులు ఎలా నమోదు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. ఆటోలకు నంబర్ప్లేట్లు లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్లడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తనిఖీలు చేసే పోలీసులకు ఈ ఆటోలు కంటపడడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, నంబర్ ప్లేట్ లేని ఆటోలను సీజ్ చేయాలని మండలవాసులు కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

