Hasarga | ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు.. నిరసనగా హంగర్గ గ్రామ పంచాయతీకి తాళం వేసిన పాలకవర్గం
పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై హంగర్గ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారని, ఇందుకోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ మంగళవారం కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు.
Hasarga | పోతంగల్, అక్టోబర్ 13 : పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై హంగర్గ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారని, ఇందుకోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ మంగళవారం కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. సంబంధిత కార్యదర్శికి సోమవారం బదిలీ అయినట్లు తెలిసిందని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మంగళవారం ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి, తమకు తెలియకుండా మరికొందరికి ఇంటి నంబర్ల కోసం రసీదులు జారీ చేశారని ఆరోపించారు.
బదిలీ అయిన వ్యక్తి ఏ హోదాలో రసీదులు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారంలో తమకు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శి తీరుపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. గ్రామపంచాయతీ వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి వివరణ ఇచ్చే వరకు కార్యాలయానికి వేసిన తాళం తీయబోమని స్పష్టం చేస్తూ అక్కడే బైఠాయించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

