Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
Varun Tej to Team Up with 'Aay' Director | గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం 'ఆయ్'. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అంజి.
Varun Tej to Team Up with ‘Aay’ Director | గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అంజి. ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ముందుగా ఈ యువ దర్శకుడు టాలీవుడ్ హీరో నితిన్‌కు ఒక కథ వినిపించగా, ఆయన ఓకే చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో అంజి అదే కథను మెగా హీరో వరుణ్ తేజ్ వద్దకు తీసుకెళ్లగా, కథ విన్న వెంటనే ఆయన పచ్చజెండా ఊపేశారని ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం గ్యాప్ లేకుండా వైవిధ్యమైన కథలతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. అందుకే అంజి చెప్పిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘ఆయ్’ చిత్రంలాగే ఈ సినిమా కూడా పూర్తి వినోదాన్ని పంచుతూ, గ్రామీణ వాతావరణంలో నవ్వులు పూయించేలా ఉండబోతుందని టాక్. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించబోతున్నారనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా, చిన్న, మీడియం రేంజ్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం తన ఇతర సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్, ఈ కొత్త ప్రాజెక్ట్ పనులపై కూడా దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

