గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
కారేపల్లి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పొడవునా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులకు ఇరువైపులా పెరిగిన పొదలు రోడ్లపైకి విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
– మలుపుల వద్ద కనిపించని రహదారులు
– వాహనదారులకు తప్పని ఇబ్బందులు
– ట్రాక్టర్లు ఉన్నా తొలగింపుపై నిర్లక్ష్యం
– చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
కారేపల్లి, అక్టోబర్ 13 : కారేపల్లి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పొడవునా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులకు ఇరువైపులా పెరిగిన పొదలు రోడ్లపైకి విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా మూల మలుపుల వద్ద పొదలు అడ్డుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు రాకపోకల సమయంలో అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ట్రాక్టర్లు ఉన్నా పట్టించుకోరా?
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ రహదారుల వెంట పెరిగిన ముళ్లపొదలను తొలగించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు రహదారుల పక్కన పెరిగిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చిన్నపాటి నిర్వహణ పనులపై దృష్టి సారిస్తే రహదారులపై ప్రయాణం సురక్షితంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
ప్రమాదాలు జరగకముందే స్పందించాలి
రహదారుల వెంట పొదలు పెరిగి దారులు ఇరుకుగా మారుతున్నా సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం మంచిదని సూచిస్తున్నారు. గ్రామీణ రహదారుల వెంట ఉన్న ముళ్లపొదలను తొలగించి, ముఖ్యంగా మూలమలుపుల వద్ద రహదారి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ట్రాక్టర్లను వినియోగించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

