Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
Are you still a virgin? | ప్రముఖ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' చివరి సీజన్ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభంకానుంది. ఈ చివరి సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మొదటి అతిథిగా విచ్చేశారు.
Are you still a virgin? | ప్రముఖ బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ చివరి సీజన్ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభంకానుంది. ఈ చివరి సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మొదటి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్ తనదైన శైలిలో సల్మాన్‌ను గతంలో అడిగిన ఒక వైరల్ ప్రశ్నను మళ్లీ అడిగి అందరినీ నవ్వించారు. ప్రోమోలో కరణ్ జోహార్ సల్మాన్‌ను ఉద్దేశించి, “నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?” అని అనగా, సల్మాన్ “కంట్రోల్ యార్ బ్రదర్” అంటూ సరదాగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ షోలో సల్మాన్ ఖాన్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, కరణ్ జోహార్‌తో సరదాగా కబుర్లు చెప్పారు. షో చివరి సీజన్ అనగానే, “ఇదే ఆఖరి సీజన్ అని చెప్పి అందరినీ ఈ షోకి రప్పించాలని చూస్తున్నావా?” అంటూ కరణ్ జోహార్‌ను సల్మాన్ ఆటపట్టించారు. దీనికి కరణ్ తాను నిజంగానే షోని ఆపేస్తున్నానని బదులివ్వగా, సల్మాన్ వెంటనే నవ్వుతూ “కరణ్ తుసీ నా జావో” అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. మొత్తానికి, ‘కాఫీ విత్ కరణ్’ చివరి సీజన్ తొలి ఎపిసోడ్ పూర్తి వినోదాన్ని పంచుతుందని ఈ ప్రోమో స్పష్టం చేస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ జియో హాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

