‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న, ఇటీవల ఓటు హక్కుకు అర్హత సాధించిన గ్రాడ్యుయేట్లు అందరూ ఓటరు నమోదు చేసుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బి.చంద్రవతి తెలిపారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని...
– ఇంటింటికి వెళ్లి నమోదు చేయించాలి
– క్షేత్రస్థాయి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
ఖమ్మం రూరల్, అక్టోబర్ 13 : గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న, ఇటీవల ఓటు హక్కుకు అర్హత సాధించిన గ్రాడ్యుయేట్లు అందరూ ఓటరు నమోదు చేసుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బి.చంద్రవతి తెలిపారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్లో బీఆర్ఎస్ నేత బానోతు కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. వార్డులో స్వయంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు చేయించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ప్రాధాన్యం గూర్చి ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. అనంతరం కృష్ణ క్యాంప్ కార్యాలయంలో నేటి వరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 25 లోపు పూర్తిస్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియ ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను ప్రత్యక్షంగా కలిసి ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు చేయించాలన్నారు. అనంతరం స్వయంగా పార్టీ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ చేసి ఓటు నమోదు అయ్యేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లకు సైతం సమాచారం ఇచ్చి, వారి వివరాలు సేకరించి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు కోసం ప్రత్యేక సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని, ఈ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రాడ్యుయేటర్లకు ఆమె సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవంతవరకు నిరంతరం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని విజయవంతంగా అమలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నేత భానోత్ జ్యోతి, బానోత్ కృష్ణ, అన్వేష్ తో పాటు స్థానిక యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

