Selected for Jawahar Navodaya | కోటగిరి : విద్యార్థులు చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. కోటగిరి మండల కేంద్రానికి చెందిన పీ గౌతం కృష్ణ కోటగిరి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ జవహర్ నవోదయకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు.
కాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జవహర్ నవోదయ కు ఎంపికైన పీ గౌతం కృష్ణ, ఆయన తల్లిదండ్రులు గోపి కృష్ణ కు సోమవారం శాలువా పూల మాలలతో ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానం చేసి అభినందించింది. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీనివాస్ రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బర్లసాయిలు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.