ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం కామదహన కార్యక్రమాలు నిర్వహించగా.. శుక్రవారం రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
చిన్నా, పెద్దా తేడాలేకుండా రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుచోట్ల ప్రకృతి సహజసిద్ధమైన రంగులను చల్లుకోవడం కనిపించింది.