Oil farm cultivation | కోటగిరి, ఆగస్టు 22 : ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట మిగతా పంటలను పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఈ పంటకు చీడపీడ పురుగుల బెడద తక్కువ అన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు ఎరువులు కూడా తక్కువగా వాడుకోవచ్చని సూచించారు.
దీనివల్ల రైతులకు ఉపయోగం కాకుండా పంట మార్పిడీ చేయడం వల్ల నేల సారవంతం కూడా పెరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ పంటలో నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే పంట ఆయిల్ పామ్ పంట అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి వాహీద్ జుమ్మా, ఏఈఓ సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదవ్ రైతులు పాల్గొన్నారు.