Helmets | వినాయక్ నగర్, సెప్టెంబర్ 16 : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని, దీన్ని గ్రహించి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. హెల్మెట్ లేని సమయంలో ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
నిజామాబాద్ నగరంలో గల వెల్ నెస్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో 100 హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ చేతుల మీదుగా
హాస్పిటల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, ఇతర వాహనదారులకు హెల్మెట్లను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలను నడపాలని సూచించారు. ద్విచక్ర వాహన దారులు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే తమ వాహనాలను నడపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్ నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్, బొదు అశోక్ ల తో పాటు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ,ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్,ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల