నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 16: ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నారు. ఏకధాటిగా కురుస్తు న్న వర్షానికి జనజీవనం స్తంభించింది. వాగులు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అక్కడికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పొతంగల్ మండలంలోని కొల్లూరు దోమలేడ్గి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం కొనసాగుతుండగా.. ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డు పైనుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారు లు అటుగా వెళ్లకుండా అధికారులు రోడ్డుపై ముళ్లపొదలు వేసి, ట్రాక్టర్ను అడ్డుగాపెట్టా రు.
బీబీపేట మండలంలోని ఎడ్లకట్ట వాగు లో వరద ఉధృతి పెరగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం నీటితో కళకళలాడుతున్నది. గోదావరిపై నిర్మించిన హైలెవెల్ అంతర్రాష్ట్ర వంతెనకు ఆనుకొని నీరు ప్రవహిస్తున్నది. పురాతన శివాలయం, జ్యోతిర్లింగాలు నీట మునిగా యి. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి, నల్లవెల్లి వాగులు పొంగిపొర్లుతుండడంతో సిర్నాపల్లితోపాటు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సిరికొండ మండలంలోని గడ్కోల్ కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు సిరికొండ, కొం డూర్ మీదుగా నిజామాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాన్సువాడ మండలంలోని చెదల, కొల్లూరు వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. బోర్లం, ఇబ్రహీంపేట్, కొయ్యగుట్ట ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. మద్నూర్ మండలంలోని గోజేగావ్, డోంగ్లి మండలంలోని లింబూర్ వాడి, అంతాపూర్ వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ధన్నూర్ శివారులో 80 ఎకరాల్లో సోయా పంట నీట మునిగింది.
కామారెడ్డి పెద్దచెరువు అలుగు పారుతున్నది. దీంతో చెరువును చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రహ రీ కూలింది. కన్నాపూర్ వాగు, ఘన్పూర్, మద్దికుంట ఎల్లమ్మబండ వద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సదాశివనగర్ మం డలంలోని అమర్లబండ, ధర్మారావు పేట గ్రామాల వాగు ఉధృతంగా ప్రవహించడం తో రాకపోకలు నిలిపి వేశారు.
ఎల్లారెడ్డి మండలం బాలాజీనగర్ తండాలో రెండు ఇం డ్లు శిథిలావస్థకు చేరడంతో ఆ కుటుంబాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. బీర్కూర్, భైరాపూర్, కిష్టాపూర్, అన్నారం గ్రామాల్లో పలు ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. భారీ వర్షాలతో మాచారెడ్డి మండలంలో నాలుగు ఇండ్లు దెబ్బ తిన్నా యి. బాధితులను పునరావాస కేంద్రా లకు తరలించారు.