జక్రాన్పల్లి/ ధర్పల్లి/చందూర్, జూన్ 12: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జోరువాన కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు జక్రాన్పల్లి, ధర్పల్లి, చందూర్ తదితర మండలా ల్లో ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. జక్రాన్పల్లి నుంచి మనోహరాబాద్ వెళ్లే రహదారిపై ఈదురుగాలులకు రోడ్డుపై ఓ చెట్టు పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్పల్లి మండల కేంద్రం నుంచి ఇందల్వాయి వెళ్లే మార్గంలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.