నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ నగరం ఉదయం నుంచి చిరు జల్లులతో తడిసి ముద్దయింది. రెండు రోజులుగా ముసురు నెలకొనడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.