Bodhan | శక్కర్ నగర్: పట్టణంలోని పురాతన ఏండ్ల చరిత్ర కలిగిన రెంజల్ బేస్ లోని హాజ్రత్ సయ్యద్ శా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్గాకు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలకు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్, పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ, ఉత్సవ కమిటీ ప్రతినిథులు అహ్మద్ బిన్ మోసిన్, హాజీ బిల్డర్ తదితరులు ప్రారంభించారు.
రాత్రి దర్గా ముత్తవలి ఇంటినుంచి చాదర్ ను ఊరేగింపుగా దర్గాకు తెచ్చి, సోమవారం తెల్లవారు జామున దర్గాపై అలంకరించారు. ఈ ఉర్సు ఉత్సవాలకు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ప్రతినిథులు ఏర్పాట్లు చేశారు.