Harsha Toyota | నిజామాబాద్, అక్టోబర్ 10 : హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనీ కంటేశ్వర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కస్టమర్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 10, 11,12 తేదీల్లో నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని, భారీ డిస్కౌంట్లతో పాటు స్పాట్ బుకింగ్ రూ.10వేలు అదనంగా డిస్కౌంట్లు కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగిందన్నారు. నాణ్యమైన కార్లు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని 5 స్టార్ రేటింగ్ కార్లని అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాషా, హర్ష టయోటా ఫైనాన్స్ గ్రూప్ హెడ్ వివేక్ యాదవ్, షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము, షోరూం సిబ్బంది అరుణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.