పోతంగల్ : కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఓ ముస్లిం అన్ని వర్గాలకు ఇతోధికంగా సహయం అందిస్తూ అందరి చేత శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో సామాజిక కార్యకర్త ఎంఏ హకీమ్ (MA Hakeem) శనివారం హనుమాన్ మాలధారణ స్వాములకు వంట పాత్రలు (Cooking utensils ) అందజేశాడు.
సుమారు రూ. 20 వేల విలువగల వంటపాత్రలు భిక్ష సమయంలో వినియోగించడానికి అందజేశాడు. ఈ నేపథ్యంలో హంగర్గ హనుమాన్ స్వాములకు పాత్రలు అందజేయడం పట్ల పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో షేరు, రాములు, చిట్టేపు శంకర్, నరసింహులు, ఈరవంత్, గురుస్వామి రాజు, మాలధారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.