Varni | వర్ని, మార్చి 24: వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సురేష్ బాబా చేతుల మీదుగా ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రారంభోత్సవంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ దశరథ్, మాజీ జెడ్పీటీసీ హరిదాసు , సర్పంచులు అనూష చిరంజీవి, గీత సీతారాం, ఎన్ గంగారం, జీ శ్రీనివాస్, ఉప సర్పంచులు కిషన్, మాదాస్, రాజేష్, నాయకులు అబ్దుల్ బారి, శనిగరం కిషన్, నరేడ్ల చిన్న సాయిలు, మాజీ ఎంపీటీసీ సాయిలు, మాజీ సర్పంచ్ దేవేందర్ తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.