తిరుమల : భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిన్న స్వామివారిని 76,464 మంది భక్తులు దర్శించుకోగా 36,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.94 కోట్లు ఆదాయం ( Hundi Income ) వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. సుమారు 4.27 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.63 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందించామని వివరించారు.
టీటీడీకి హైదరాబాద్కు చెందిన వైద్య దంపతుల విరాళం

హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పి.శిల్పా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ.15 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.