న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆ కేసులో ఆగస్టు 6వ తేదీన తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తె లిసిందే. ఆ తీర్పుకు వ్యతిరేకంగా తరుణ్ సుప్రీంను ఆశ్రయించారు. అడ్వకేట్ ఆదిత్య సమద్దర్ పిటిషన్ దాఖలు చేశారు. తెహల్కా మాజీ ఎడిటర్‌కు శిక్ష విధించాలని గోవా ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరానికి చాలా తక్కువ శిక్ష విధించినట్లు గోవా సర్కారు అభిప్రాయపడింది. 2013లో ఓ హోటల్ ఎలివేటర్లో తన వద్ద పనిచేస్తున్న జూనియర్ అమ్మాయిని రేప్ చేసినట్లు తేజ్పాల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాను రాజకీయ బాధితుడిని అయినట్లు 62 ఏళ్ల తరుణ్ పేర్కొన్నాడు.
తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానాను విధిస్తూ బాంబే (Bombay) హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తేజ్‌పాల్ తనపై రేప్ చేశాడని తెహెల్కా (Tehelka) ఉద్యోగిని 2013లో కేసు పెట్టింది. ఆ కేసులో గోవా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. విచారణ అనంతరం తేజ్‌పాల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది బాంబే హైకోర్టు. అంతేకాకుండా రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆర్డర్ వేసింది. జస్టిస్ (Justice) నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాందేకర్లతో కూడిన ధర్మాసనం సెక్షన్ 376(2)(f), 376(2)(k)తో పాటు సెక్షన్ 354A అండ్ 354B కింద అత్యాచారం, లైంగిక వేధింపుల నేరాలకు సంబంధించి తేజ్పాల్ను దోషిగా తేల్చింది.