Comedian Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగమైన వార్త వైరల్ అవుతోంది. తమ కుటుంబ బంధాలు గురించి బ్రహ్మానందం అన్నయ్య శ్రీ వదన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. బ్రహ్మానందంతో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మా కుటుంబంలో మేం మొత్తం ఆరుగురు సంతానం కాగా, అందులో నలుగురు ఇప్పటికే చనిపోయారని, ప్రస్తుతం తాము ఇద్దరమే మిగిలామని వదన్ తెలిపినట్లు ఈ వీడియోలో ఉంది. అయితే తాను ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయానని, ఈ మధ్యనే ఊరికి వచ్చిన బ్రహ్మానందం కనీసం తనను పలకరించకుండానే వెళ్ళిపోయారని వాపోయారు. “తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ‘అన్నయ్యా, ఎలా ఉన్నావు?’ అని అడుగుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తున్నా.. గొప్పవాళ్ళు పలకరిస్తే చిన్నవారికి ఎంతో సంతోషంగా ఉంటుంది” అంటూ ఆయన తన గుండెల్లోని ఆవేదనను వెళ్లగక్కారు.
అయితే బ్రహ్మానందంపై తన అన్నయ్య వదన్ ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయలేదని, కేవలం ఒక అన్నగా తన తమ్ముడి ప్రేమ కోసం పరితపిస్తున్న భావోద్వేగాన్ని మాత్రమే పంచుకున్నారని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన కుటుంబానికి చేసిన సహాయాలను ఆయన గుర్తుచేసుకున్నట్లు వీడియోలో ఉంది. “నా ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసింది, అలాగే ఈ ఇల్లు కట్టించింది నా తమ్ముడు బ్రహ్మానందమే. ఆ రోజుల్లోనే రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి నా పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయించాడు” అంటూ తమ్ముడి గొప్పతనాన్ని కొనియాడారు. సోషల్ మీడియాలో ఈ విషయమై పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు కామెంట్లు చేయడం సరికాదని, ఆయన కేవలం తన మనసులోని ఆవేదనను మాత్రమే వ్యక్తపరిచారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వృద్ధాప్యం లో అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం గారి
తోడబుట్టిన అన్నయ్య..మేము ఆరుగురు సంతానం నలుగురు చనిపోయారు ఉన్నది ఇద్దరమే , ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే,
ఈ మధ్యనే వచ్చాడు ఊరికి,కనీసo
పలకరించకుండా పోయాడుతమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ ఎలా… pic.twitter.com/901plLBjun
— AVM (@AvmNews7) August 19, 2026
నా ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసింది, ఈ ఇల్లు కట్టించింది తమ్ముడు బ్రహ్మానందమే
ఆ రోజుల్లో 50 వేలకు పైగా ఖర్చు చేసి నా బిడ్లల పెళ్లిళ్లు చేశాడు తమ్ముడు
–బ్రహ్మానందం గారి అన్నయ్య శ్రీ వదన్ గారు
( పూర్తిగా తెలియకుండా ఓ రెచ్చిపోతున్నారు ఎందుకు కామెంట్స్ లో ఆయన నెగటివ్ గా ఏం… https://t.co/87TxZmfxnc pic.twitter.com/myGw77mEPf
— AVM (@AvmNews7) August 19, 2026