జమ్మూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్(Chenab Bridge)పై అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. ఆ బ్రిడ్జ్‌పై వందేభారత్ రైలు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ఘటన ఇటీవల జరిగింది. చీనాబ్ బ్రిడ్జ్‌పై వంద స్పీడ్‌తో రైలు ప్రయాణించడం ఇదే మొదటిసారి. నార్తర్న్ రైల్వేకు చెందిన వైష్ణోదేవి-బానిహల్ మార్గం సుమారు 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మార్గంలోనే చీనాబ్ బ్రిడ్జ్ ఉన్నది. అయితే రైలు వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు పెంచాలని రైల్వేశాఖ ఆదేశాలు ఇవ్వడంతో స్పీడ్ పెంచేశారు. అయితే చీనాబ్ బ్రిడ్జ్‌పై ఇప్పటి వరకు అత్యధికంగా 85 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేది. ఇప్పుడు స్పీడ్ పర్మిట్‌ను పెంచారు.
Speed Meets Engineering At Chenab!
A new milestone for Indian Railways as Vande Bharat run at nearly 100 kmph for the first time across the world’s highest railway bridge, the iconic Chenab Bridge.#VandeBharat pic.twitter.com/KCfXHYvmZV
— MyGovIndia (@mygovindia) August 20, 2026