రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ‘పచ్చదనం- స్వచ్ఛదనం’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు. కానీ మొక్కలను సంరక్షించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. మొక్కుబడిగా మొక్కలు నాటి మమ అనిపించారు.
రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయకపోవడంతో అవి మేకలకు ఫలహారంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు, నిర్మలహృదయ కాన్వెంట్ ప్రాంతంతోపాటు ఖానాపూర్ వెళ్లే మార్గంలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఎండిపోతున్నాయి. ఇందులో కొన్నింటిని మేకలు తినేయడంతో మొక్కలకు సపోర్టుగా నాటిన కర్రలే దర్శనమిస్తుండడం గమనార్హం.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్