బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 10 :సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారంతో రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావారణం నెలకొన్నదని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బోర్లం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ తి వనాన్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలను నాటారు. రాష్ట్రంలో 12, 751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి తోడు ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపులో భాగంగా రాష్ట్రంతో పాటు దేశ,విదేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలను నాటుతున్నారని వివరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్రంలో ఒక ఉద్యమంలా కొనసాగుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. బోర్లం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంపై ఎంపీపీ దొడ్ల నీరజ, సర్పంచ్ సరళను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, ఎంపీటీసీ శ్రావణి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో యావర్ హుస్సేన్ సూఫీ, నా యకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గో పాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, పిట్ల శ్రీధర్, సయ్యద్ జలీల్, అన్నం హన్మాం డ్లు, వడ్ల వెంకటేశం, సాయిరెడ్డి, మంద సాయిలు పాల్గొన్నారు.