ధర్పల్లి, జూన్ 28 : మండల కేంద్రంలోని 30 పడకలుగా ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు బుధవారం సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలోని గాంధీచౌక్ నుంచి డీజేతో ధర్పల్లి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నృత్యాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. వంద పడకలకు అప్‌గ్రేడ్‌తోపాటు రూ. 33.15 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, పార్టీ నాయకులు హన్మంత్‌రెడ్డి, వెంకన్న, అబ్దుల్ మజీద్, గంగారెడ్డి, సుభా ష్, సురేందర్‌గౌడ్, గంగాదాస్, గోపాల్‌నాయక్, నజీర్, బాలయ్య, బాబన్న, పోతరాజు, సురేశ్, భారతిరాణి పాల్గొన్నారు.
సిరికొండలో ..
సిరికొండ, జూన్ 28: మండల కేంద్రంలోని సీహెచ్‌సీని వంద పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తూ మండలంలోని చీమన్‌పల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.